బిగ్‌బాస్ లూటీ.! ప్రైజ్ మనీ అంతా దోచేస్తున్నాడుగా.!

- November 16, 2022 , by Maagulf
బిగ్‌బాస్ లూటీ.! ప్రైజ్ మనీ అంతా దోచేస్తున్నాడుగా.!
బిగ్‌బాస్ సీజన్ 6 విన్నింగ్ ప్రైజ్ మనీని ఇచ్చే వుద్దేశ్యం లేదనుకుంటా ఈ సారి బిగ్‌బాస్‌కి. ఎప్పుడూ లేని విధంగా టాస్కులకు ప్రైజ్ మనీతో లింకులు పెట్టేస్తున్నాడు. లింకులు పెడితే పెట్టాడు. టాస్క్‌ల్లో ఫెయిలైనా, పాసైనా ప్రైజ్ మనీలో కోతలు విధిస్తున్నాడు.
తాజాగా ఇమ్యూనిటీ పేరుతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్ బిగ్‌బాస్ వీక్షకుల్ని విస్మయానికి గురి చేస్తోంది. డ్రాప్ బాక్స్, చెక్ డిపాజిట్.. అంటూ ఓ విచిత్రమైన టాస్క్ పెట్టాడు తాజాగా బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో హయ్యెస్ట్ యూనిక్ అమౌంట్‌ని డ్రాప్ బాక్స్‌లో వేసిన వారికి ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ వస్తుందని చెప్పాడు.
అంతా బాగానే వుంది. ఏ ఇద్దరూ సేమ్ అమౌంట్ వేసినా వారు ఇమ్యూనిటీ దక్కించుకోలేరు. అలా రాజ్ డిఫరెంట్ హయ్యెస్ట్ యూనిక్ అమౌంట్ వేయగా, అతనికి ఇమ్యూనిటీ దక్కింది. ప్రైజ్ మనీ పోయింది. అదేనండీ, ఆయన ఎంత అమౌంట్ అయితే, డ్రాప్ బాక్స్‌లో వేశాడో ఆ అమౌంట్, ఒకవేళ బిగ్‌బాస్ విన్నర్ అయితే వచ్చే ప్రైజ్ మనీ నుంచి ఆ అమౌంట్ కట్ చేసి ఇచ్చేలా ఈ టాస్క్ డిజైన్ చేశాడు.
ఈ టాస్క్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. 20 మంది సభ్యులతో స్టార్ట్ అయిన ‘బిగ్’ హౌస్, ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులతో రన్ అవుతోంది.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com