మద్యం మత్తులో ఇతరుల అపార్ట్మెంట్లోకి.. వ్యక్తికి 10,000 దిర్హామ్‌ల జరిమానా
- November 17, 2022
దుబాయ్: మద్యం మత్తులో తన పొరుగువారి అపార్ట్మెంట్లోకి చొరబడినందుకు.. దాని నివాసితులు కోరినప్పటికీ బయటకు వెళ్లేందుకు నిరాకరించినందుకు దుబాయ్ మిస్‌డిమీనర్ -ఉల్లంఘనల కోర్టు ఒక వ్యక్తికి Dh10,000 జరిమానా విధించింది. దుబాయ్ మెరీనాలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో గత మే నెలలో ఈ ఘటన జరిగినది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూరోపియన్ సంతతికి చెందిన 34 ఏళ్ల నిందితుడు అకస్మాత్తుగా తన అపార్ట్మెంట్లోకి ప్రవేశించడంతో ఆశ్చర్యపోయానని, ఆ వ్యక్తిని లోపలికి రాకుండా ఆపడానికి ప్రయత్నించానని, అయితే నిందితుడు నిరాకరించి, బలవంతంగా లోనికి ప్రవేశించాడని గల్ఫ్ దేశానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫిర్యాదుదారుని నివాసానికి ఆనుకుని ఉన్న ప్లాట్ లో ఉంటానని, మద్యం మత్తులో గందరగోళానికి గురై వేరే వాళ్ల ప్లాట్ లోకి వెళ్లినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఒక ఇంటి యజమాని ఇష్టానికి వ్యతిరేకంగా వారి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దోషిగా నిర్ధారించి అతనికి 10,000 దిర్హామ్ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం