ఎత్తైన భవనంపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి
- November 17, 2022
యూఏఈ: షార్జాలో అల్ తవూన్ ప్రాంతంలోని భవనం 14వ అంతస్తు నుంచి పడి ఆసియా సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. అల్ బుహైరా పోలీసుల కథనం ప్రకారం.. కేసు ఫైల్ తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ప్రమాదం గురించి సోమవారం ఉదయం కాల్ వచ్చిందని, ప్రమాద స్థలానికి చేరేసరికే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ సాగుతుందన్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోదని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరిలో షార్జాలోని కింగ్ ఫైసల్ స్ట్రీట్‌లో ఉన్న రెసిడెన్షియల్ టవర్ 32వ అంతస్తు నుండి పడి 10 ఏళ్ల ఆసియా పిల్లవాడు మరణించాడు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







