మద్యం మత్తులో ఇతరుల అపార్ట్‌మెంట్‌లోకి.. వ్యక్తికి 10,000 దిర్హామ్‌ల జరిమానా

- November 17, 2022 , by Maagulf
మద్యం మత్తులో ఇతరుల అపార్ట్‌మెంట్‌లోకి.. వ్యక్తికి 10,000 దిర్హామ్‌ల జరిమానా

దుబాయ్: మద్యం మత్తులో తన పొరుగువారి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడినందుకు.. దాని నివాసితులు కోరినప్పటికీ బయటకు వెళ్లేందుకు నిరాకరించినందుకు దుబాయ్ మిస్‌డిమీనర్ -ఉల్లంఘనల కోర్టు ఒక వ్యక్తికి Dh10,000 జరిమానా విధించింది. దుబాయ్‌ మెరీనాలోని ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో గత మే నెలలో ఈ ఘటన జరిగినది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూరోపియన్ సంతతికి చెందిన 34 ఏళ్ల నిందితుడు అకస్మాత్తుగా తన అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో ఆశ్చర్యపోయానని,  ఆ వ్యక్తిని లోపలికి రాకుండా ఆపడానికి ప్రయత్నించానని, అయితే నిందితుడు నిరాకరించి, బలవంతంగా లోనికి ప్రవేశించాడని గల్ఫ్ దేశానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫిర్యాదుదారుని నివాసానికి ఆనుకుని ఉన్న ప్లాట్ లో ఉంటానని, మద్యం మత్తులో గందరగోళానికి గురై వేరే వాళ్ల ప్లాట్ లోకి వెళ్లినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఒక ఇంటి యజమాని ఇష్టానికి వ్యతిరేకంగా వారి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దోషిగా నిర్ధారించి అతనికి 10,000 దిర్హామ్ జరిమానా విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com