19న బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె..

- November 17, 2022 , by Maagulf
19న బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె..

న్యూ ఢిల్లీ: భారత దేశంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్. వెంకటాచలం వెల్లడించారు. తమ యూనియన్లకు చెందిన ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల దాడులు జరుగుతున్నాయని, దీన్ని నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల్ని విధుల్లోంచి తొలగించడం చేస్తున్నారని వెంకటాచలం ఆరోపించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ల హక్కుల్ని కాలరాస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు అనేక సర్వీసుల్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఉద్యోగుల బదిలీల్లో కూడా అనైతిక పద్ధతులు అనుసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని నిరసిస్తూ ఈ నెల 19, శనివారం సమ్మె చేపడుతున్నట్లు వెంకటాచలం వెల్లడించారు. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, వినియోగదారులు దీనికి అనుగుణంగా తమ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటే మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com