ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్' మొబైల్ వ్యాన్ ను ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- November 19, 2022
హైదరాబాద్: రోజు వాడే ఆహారపదార్థాలలో కల్తీ జరుగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ సెక్యూరిటీ స్టాండెడ్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘ఫుడ్ సేప్టి ఆన్ వీల్స్‘‘ మొబైల్ వ్యాన్ ను శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ... ‘‘ఈట్ రైట్‘‘ లో భాగంగా రోజు వాడే ఆహారపదార్థాల్లో నాణ్యత ప్రమాణాల పై, కల్తీ నివారణకు జిహెచ్ఎంసి అన్ని సర్కిళ్లలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంయుక్తంగా ఈ మొబైల్ వ్యాన్ ల ద్వారా తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు వారిపై తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్ లో డిజిటల్ బ్యాలెన్స్, డిజిటల్ మల్టీ పార మీటర్, హ్యాండ్ మిల్లీ మీటర్ (పి.హెచ్ కండెక్టివిటీ, టి.డి.ఎస్, టెంపరేచర్), డిజిటల్ రీఫ్యాక్టో మీటర్ పోర్టబుల్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్కీనింగ్ ఉపకరణాలు, మిక్సర్ గ్రైండర్ వంటి పరికరాలు ఉంటాయని అన్నారు. ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాప్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఉంటారని తెలిపారు. స్ట్రీట్ వెండర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడుతున్న సంబంధిత పదార్థాలు, ఆయిల్స్, బేకింగ్ పౌడర్, కాన్ ఫ్లెక్స్, మసాలా లు, బెల్లం, చక్కెర, ఆర్టిఫిషియల్ స్వీట్స్, టమాటో సాస్, పచ్చళ్లు, టీ పౌడర్, చాక్ లెట్స్, అయోడైజ్ సాల్ట్, బిస్కెట్స్, ఫుడ్ కలర్, మినరల్ వాటర్, సిల్వర్ లీఫ్స్, క్యాన్డ్ ఫుడ్స్, జెలటిన్, క్యాటెకు, చూరింగమ్, బబుల్గమ్, ఇన్ స్టంట్ కాఫీ మిక్చర్, బ్రెడ్, కేక్స్, పేస్ట్రీ, వెనిగర్, సింతటిక్ వెనిగర్, ఆటా, మైదా, సూజి, బేసన్, వంట సోడా, చనా, పన్నీర్, కోవా, శ్రీకండ్, చీస్, బనస్పతి ఆయిల్, కార్బోనేటెడ్ వాటర్, ఆరో రూట్, ఇంగువ, సాఫ్రాన్, ఫ్రూట్ జెల్లి పదార్థాలపై సర్కిల్ వారిగా తనిఖీలు చేపట్టుతారు అంతేకాకుండా వారికి మొదటగా అవగాహన కల్పించి తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల టెస్టింగ్ ను పరిశీలించారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు (22 మంది) తమ ఫోన్ నెంబర్లను కన్జూమర్స్ కు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 30 సర్కిళ్లలో ప్రతిరోజు ఒక సర్కిల్ లో తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఎఫ్.ఎస్.ఓ లు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ లో భాగంగా మొదటగా అవగాహన, టెస్టింగ్, ట్రైనింగ్ వీధి వ్యాపారులకు కల్పించాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతప్రమాణాల విషయంలో అనుమానాలు ఉంటే జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెం. 040-21111111 ను సంప్రదించాలని మేయర్ తెలిపారు.
డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ... ఆహార భద్రతలో ప్రతి ఒక్కరూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఆహార పదార్థాల తనిఖీ వివరాలు రోజువారీగా సమాచారం ఇవ్వాలని అన్నారు. ముందుగా ఆహార కల్తీ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల పై దృష్టి సారించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చిత్తశుద్ధితో పని చేసి ప్రజలకు కల్తీ లేని ఆహారం అందించేందుకు విశేష కృషి చేయాలని అన్నారు. ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలజీ మాట్లాడుతూ... ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేర మొబైల్ ల్యాబ్ వాహనాన్ని రాష్ట్రానికి 5 కేటాయించారని హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ అందజేసినట్లు చెప్పారు. మాల్స్, వ్యాపార సముదాయాలు,హోటల్ తదితర వ్యాపార స్ట్రీట్ వెండర్స్ సంబంధిత వారందరికీ ముందస్తుగా అవగాహనతో ముందస్తు హెచ్చరికలు జారీ చేసేటప్పుడు ఎలాంటి మార్పు రాని వారిని ఉపేక్షించేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు సుదర్శన్ రెడ్డి, మూర్తి రాజు, ఎఫ్.ఎస్.ఓ లు ప్రీతి, శృతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!