దుబాయ్ రన్: షేక్ జాయెద్ రోడ్ నవంబర్ 20న మూసివేత

- November 19, 2022 , by Maagulf
దుబాయ్ రన్: షేక్ జాయెద్ రోడ్ నవంబర్ 20న మూసివేత

యూఏఈ: దుబాయ్ రన్ నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్ ను నవంబర్ 20న( ఆదివారం) మూసివేయనున్నట్లు రోడ్స్ & ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తన ట్విటర్ హ్యాండిల్ లో వెల్లడించింది. రేసు సమయంలో ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని వాహనదారులకు సూచించింది.

ప్రభావితమయ్యే రహదారులు:

-షేక్ జాయెద్ రోడ్, మహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ రోడ్లు ఉదయం 4 నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయబడతాయి.

-ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డును ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇరువైపులా మూసి ఉంచుతారు.

-షేక్ మహ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ ఉదయం 4 నుండి 10 గంటల వరకు మూసివేయబడుతుంది.

ప్రత్యామ్నాయ మార్గాలు:

అల్ వాస్ల్ స్ట్రీట్, అల్ ఖైల్ రోడ్, అల్ మైదాన్ స్ట్రీట్, అల్ అసయెల్ స్ట్రీట్, 2వ జబీల్ స్ట్రీట్, 2వ డిసెంబర్ స్ట్రీట్, అల్ హదికా స్ట్రీట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com