అలా అయితే, తెలుగు సినిమాని అడ్డుకుంటామంటోన్న తమిళ తంబీలు.!
- November 19, 2022
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్లో రూపొందిస్తున్న సినిమా ‘వారసుడు’. తమిళ హీరో విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మొదట స్ట్రెయిట్ తెలుగు సినిమా అన్నారు. ఆ తర్వాత బైలింగ్వల్ అన్నారు. ఇప్పుడేమో తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ మాత్రమే అని తేల్చారు.
ఓకే, అది కూడా ఓకే. కానీ, అసలు విషయమేంటంటే, సంక్రాంతి సీజన్లో తెలుగులో రిలీజ్ అవుతోన్న పెద్ద సినిమాలకు పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేస్తూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు ధియేటర్లు లేకుండా చేస్తున్నారు.
అదే అసలు గొడవ. దాంతో తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. ఆ అభ్యంతరాలను తమిళ తంబీలు వ్యతిరేకిస్తున్నారు. మీ తెలుగు సినిమాల్నీ మా తమిళంలో రిలీజ్ చేస్తుంటే ఆదరిస్తున్నాం. మా తమిళ సినిమాల విషయంలో మీరు ఇలా చేస్తారా.? ఇలా అయితే, ఇకపై మీ తెలుగు సినిమాల్ని తమిళంలో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామంటూ గోల చేస్తున్నారు.
ఇలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారిలో రీసెంట్గా రామ్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ లింగు స్వామి కూడా వుండడం గమనార్హం.!
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!