‘ఆది పురుష్’ డ్యామేజీకి ‘అలా’ కవరింగులేస్తున్నారా.?

- November 19, 2022 , by Maagulf
‘ఆది పురుష్’ డ్యామేజీకి ‘అలా’ కవరింగులేస్తున్నారా.?

యూనివర్సల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రబాస్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావల్సి వుంది. కానీ, రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కి రెస్పాన్స్ భిన్నంగా రావడంతో, చిత్ర యూనిట్ పునరాలోచనలో పడ్డారు.
దాంతో, సినిమా రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. జనవరిలో రావల్సిన ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేస్తామంటూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. టీజర్‌కి వచ్చిన నెగిటివిటీని చిత్ర యూనిట్ జీర్ణించుకోలేకపోతోందట. 
ఆదిలోనే హంస పాదు.. అన్నట్లుగా టీజర్‌కే ఇంత నెగిటివిటీ వస్తే, సినిమాని ఎలా ఆదరిస్తారో.? అసలు ఆదరిస్తారా.? లేదా.? అనే అనుమానాలు తలెత్తడంతో, రీ షూట్లు, వీలైతే కొన్ని పెద్ద పెద్ద మార్పులే చేసేందుకు రెడీ అయ్యారు. అందుకే ఎక్స్‌ట్రా టైమ్ తీసుకుంటున్నారు.. అంటూ మరో ట్రోల్ స్టార్ట్ అయ్యింది. 
అయితే, ఈ డ్యామేజిని కవర్ చేసుకునేందుకు డ్యామేజీ కంట్రోల్ స్టార్ట్ చేసినట్లుంది ‘ఆది పురుష్’ టీమ్. హీరోయిన్ కృతి సనన్‌తో సరికొత్త పబ్లిసిటీ చేయిస్తున్నారు. టీజర్ చూసి, సినిమా మొత్తాన్నీ ఎలా వ్యతిరేకిస్తారు.? ఓం రౌత్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతంగా తీర్చి దిద్దారు.. అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది. కృతి సనన్ వ్యాఖ్యలకు ‘వావ్.! వాట్ ఏ కవరింగ్ యా.!’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com