దర్శకుడు తేజ ఈ కొత్త డ్రామాలు అందుకోసమేనా.?

- November 19, 2022 , by Maagulf
దర్శకుడు తేజ ఈ కొత్త డ్రామాలు అందుకోసమేనా.?

దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తనకు తెలుసు.. అంటూ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటీ.! ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకుని చనిపోయాడు కదా.. తేజకి చెప్పి చనిపోయాడా.? అయితే.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సూసైడ్ చేసుకుని చనిపోవడమంటే, అది క్రైమ్ కేసు. ఈ క్రైమ్ కేసు గురించి ఎలాంటి వివరాలు తెలిసినా అది వెంటనే పోలీసులకు తెలియచేయాలి. అలాంటిది ‘నాకు తెలుసు కానీ, ఇప్పుడు చెప్పను..’ అని తేజ ఇప్పుడెందుకు ఈ గడిచిపోయిన ఈ విషయం ఎత్తాడట కొత్తగా. ఇది పెద్ద క్రైమ్ కదా.!
అంతేకాదు, ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి కారణమైన చాలా మందిలో డైరెక్టర్ తేజ కూడా ఓ కారణమని అంటుంటారు. ‘ఔనన్నా కాదన్నా’ సినిమా టైమ్‌లో ఉదయ్ కిరణ్‌ని తేజ బాగా అవమానించారట. తనను క్షమించమని కాళ్లు పట్టుకుని వేడుకున్నాడట కూడా ఉదయ్ కిరణ్. కానీ, తేజ ఆటిట్యూడ్ చూపించాడట. దాంతో ఆ అవమానం తట్టుకోలేకే ఉదయ్ చనిపోయాడని అంటుంటారు. 
అదే మరి, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు తేజ ఓవరాక్షన్‌కి ఈ కేసు మొత్తం ఆయన మెడకి చుట్టుకున్నా చుట్టుకోవచ్చు. త్వరలో ఆయన సినిమా ‘అహింస’ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న కారణంగా ఈ విధంగా తేజ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com