ధియేటర్లు దండగ, ఓటీటీలే పండగ.!

- November 19, 2022 , by Maagulf
ధియేటర్లు దండగ, ఓటీటీలే పండగ.!

కరోనా మహమ్మారి పేరు చెప్పి ధియేటర్లకు జనం వెళ్లడం అనేది ఉత్త మాటే అయిపోయింది. సర్లే అలా అలా ఆ కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందామనుకుంటే, సినిమా టిక్కెట్ల రేట్లు ధియేటర్ల దీన పరిస్థితిని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
టిక్కెట్ల రేట్లు పెంపు ఇష్యూతో మొత్తానికి ధియేటర్లకు జనం వెళ్లడం మానేశారు. కరోనా పుణ్యమా అని అలవాటైన ఓటీటీలకే జనం పరిమితమైపోయారు. ఎంత చేసినా, ఏం చేసినా ధియేటర్లను జనం ఎంకరేజ్ చేసే అవకాశమే కనిపించడం లేదు.
సినిమా చాలా చాలా బావుంది.. అంటే కొంతమంది ప్రేక్షకులు మాత్రమే ధియేటర్లకు ఆకర్షితులవుతున్నారు. చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసమే ఎదురు చూస్తున్నారు. దాంతో సినిమా బాగున్నా, బాగోక పోయినా ధియేటర్ల భవిష్యత్తు కేవలం వీకెండ్స్ రెండు, మూడు రోజులకు మాత్రమే పరిమితమైపోయింది.
దాంతో, ధియేటర్ల యజమానుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. పైకి చెప్పుకోలేని బాధ ఇది. ధియేటర్లకు భవిష్యత్తే లేదనేది వుత్త మాట కానే కాదు. మరోవైపు ఓటీటీ ధియేటర్లు అదేనండీ హోమ్ ధియేటర్లు మాత్రం కళకళలాడుతున్నాయ్. 
ఓటీటీలో ఏ సినిమా వచ్చినా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు చూస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఇంకా బాగా ఆదరిస్తున్నారు. సో భవిష్యత్తు అంతా ఓటీటీలదే, ధియేటర్లు శుద్ధ దండగ.. ఇదీ సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com