రియాద్ లో 'కల్చర్ కిడ్స్' ఫెస్టివల్
- November 19, 2022
రియాద్: నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రియాద్‌లోని గ్రెనడాస్ అరేనాలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు రోజుల "కల్చర్ కిడ్స్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. "ఇంటరాక్టివ్, విద్యా కార్యకలాపాలు" పేరిట పలు రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. 4 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సంగీతం, లాబ్రింత్, ఫ్యాషన్, క్రాఫ్ట్స్, సౌదీ వంటకాలతో ఆవిష్కరణ, అవగాహన కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. అలాగే "అనుభవాలు, జ్ఞానం" కింద మోటారు నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడం, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం, ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సృజనాత్మకత ప్రపంచం, అరబిక్ కాలిగ్రఫీపై నిపుణులతో అవగాహన కల్పించనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







