వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోడీ
- November 19, 2022
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు ప్రధాని మోడీ. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారినిక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి తిరుక్కురల్ మరియు కాశీ-తమిళ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు మరియు తమిళ విద్యార్థులతో సంభాషించారు. తమిళనాడులోని మఠా దేవాలయాల ఆదినాములకు (మఠాధిపతులకు) కూడా గౌరవం ఇస్తూ వారి ఆశీర్వాదాలను కూడా ప్రధాని మోడీ కోరనున్నారు.
కాశీలో నేటి నుంచి కాశీ-తమిళ సంగమం ఉత్సవాలు జరగనున్నాయి. తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి గురించి యూపీలో ప్రదర్శన చేయనున్నారు. తమిళ వంటకాలు అక్కడ గుమగుమలాడనున్నాయి. తమిళ సంగీతం కూడా కాశీలో మారుమోగనున్నది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఆ బృందానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కాశీ తమిళ సంగమం ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు