న్యూజిలాండ్‌ పై టీమ్‌ ఇండియా ఘన విజయం

- November 20, 2022 , by Maagulf
న్యూజిలాండ్‌ పై టీమ్‌ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌: న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టిన వేళ, కివిస్‌ ముందు భారత్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీసిన వేళ, కివిస్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ 61(52) ఒంటరిపోరాటం వృథా అయింది. దీంతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌పై చేయి సాధించింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే

టీమ్ ఇండియా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ మొదటి నుంచి తడబడుతూనే ఆడింది. విలియమ్సన్‌తో కలిసి కాన్వే కొద్దిసేపు భారత్‌ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్‌ ఇచ్చి కాన్వే 25(22) వెనుదిరిగాడు. ఆ తర్వాత కివిస్‌ను భారత్‌ బౌలర్లు కుదురుకోనీయలేదు. క్రమంగా వికెట్లు తీస్తూ వచ్చారు.  మరోవైపు విలియమ్సన్‌ 61(52) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్స్‌ నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో కివిస్‌ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా, చాహల్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com