ఒమన్ ఎయిర్.. 65% ప్రీ-పాండమిక్ నెట్వర్క్ పునరుద్ధరణ
- November 21, 2022
మస్కట్ : ఒమన్ ఎయిర్ తన ప్రీ-పాండమిక్ నెట్‌వర్క్‌లో 65 శాతం పునరుద్ధరణ జరిగిందని ఒమన్ ఎయిర్ సీఈఓ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ అల్ రైసీ తెలిపారు. 2023 చివరి నుండి 2024 ప్రారంభం మధ్య ఫ్లీట్ , గమ్యస్థానాలకు సంబంధించిన పూర్తి కార్యకలాపాలు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయని తెలిపారు. మొరాకో, చైనా మినహా కొవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేయబడిన గమ్యస్థానాల నెట్‌వర్క్‌లోని చాలా మార్గాలను ఎయిర్‌లైన్ ఇప్పటికే పునఃప్రారంభించిందని వెల్లడించారు. డిసెంబర్ నుండి మాస్కోకు విమానాలను తిరిగి ప్రారంభించనున్నట్లు.. 2023లో మరిన్ని గమ్యస్థానాలను ప్రారంభించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఇంధన ధరల పెరుగుదల, రష్యా-ఉక్రేనియన్ సంక్షోభం, అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలలో వర్తించే చర్యలు కంపెనీ ఆదాయాలను గణనీయంగా ప్రభావితం చేశాయని రైసీ తెలిపారు. ఒమానిసేషన్పై, ఒమానీ యువతకు శిక్షణ ఇవ్వడంలో, ప్రత్యేకించి ఉపాధి సంబంధిత శిక్షణ రంగంలో కంపెనీ గణనీయంగా పెట్టుబడి పెడుతుందని రైసీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …