అబ్బురపరిచిన ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు

- November 21, 2022 , by Maagulf
అబ్బురపరిచిన ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు

దోహా: ఆదివారం అల్ బేట్ స్టేడియంలో జరిగిన FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 ప్రారంభ వేడుకలు అబ్బురపరిచాయి. మిరుమిట్లు గొలిపే ప్రదర్శనల ద్వారా ప్రపంచ సంస్కృతితో ఖతార్ సంప్రదాయాలను సమ్మిళితం చేసేలా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వేడుకలో మొదటగా ది కాల్ పేరుతో ఖతార్ మహిళ గోల్డెన్ మోర్టార్ నుండి 12 స్ట్రైక్స్ శబ్దం నుండి వచ్చిన కాల్‌కు ప్రతిస్పందన సినిమా దృశ్యాలను ప్రదర్శించారు. ఖతారీ సాంప్రదాయ దుస్తులలో ఖతారీ మహిళలు తమ ఒంటెలతో చేసిన ప్రదర్శన హైలెట్ గా నిలిచింది. అనంతరం గల్ఫ్ ప్రాంతంలోని జానపద పాట ప్రేరణతో ఖతారీ కళాకారిణి డానా ఆలపించిన గీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. గ్రూప్ Aలో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య ప్రారంభ మ్యాచ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com