జెడ్డా వాటర్ ఫ్రంట్‌లోకి దూసుకెళ్లిన కారు
- November 21, 2022
జెడ్డా : జెడ్డా కార్నిచ్ వాటర్ ఫ్రంట్‌లోకి ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో చిక్కుకుపోయిన ఒక మహిళను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ (911) ఒక వాహనం.. గాయపడ్డ మహళను, వాటర్ ఫ్రంట్ లో పడే ముందు కారు ఢీకొట్టడంతో గాయపడ్డ పాదచారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్నిచ్ రోడ్డులో మహిళ నడుపుతున్న కారు అదుపు తప్పి కాలిబాటపైకి దూసుకెళ్లి పాదచారిని ఢీకొట్టింది. అనంతరం వాటర్ ఫ్రంట్ లో పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన సౌదీ పౌరుడు హటాన్ అల్-జహదాలీ అప్రమత్తమై నీటిలో దిగి మహిళ ప్రాణాలను కాపాడాడు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్