ఇండోనేషియా జావాలో భారీ భూకంపం..20 మంది మృతి
- November 21, 2022
జకార్తా: ఇండోనేషియా ప్రధాన ద్వీపం జావాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజుర్ కు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
భూకంపం ప్రభావంతో సియాంజుర్ లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన అనేకమందిని బయటికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. భూకంపం ప్రభావంతో ఇక్కడికి దూరంలో ఉన్న రాజధాని జకార్తాలో సముద్రపు అలలు ఎగసిపడ్డాయి.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్