ఫిఫా ప్రపంచ కప్: కువైట్ నుండి దోహాకు డైరెక్ట్ షటిల్ సర్వీస్
- November 21, 2022
కువైట్: కువైట్ లోని ఫుట్‌బాల్ ప్రేమికులు దోహాలో జరిగే ప్రపంచ కప్‌ను చూసేందుకు కువైట్ ఎయిర్‌లైన్స్ డైరెక్ట్ షటిల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఖతార్‌లో జరిగే 2022 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు హాజరు కావడానికి కువైట్ నుండి దోహాకు నేరుగా విమానాలను కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ నడుపుతున్నట్లు ప్రకటించాయి. ఫుట్ బాల్ అభిమానులు మ్యాచ్‌లకు హాజరై అదే రోజు కువైట్‌కు తిరిగి రావచ్చని తెలిపాయి. అయితే, దోహాకు ప్రయాణించే అభిమానులు తప్పనిసరిగా మ్యాచ్ డే టిక్కెట్‌ను కలిగి ఉండటంతోపాటు ఖతార్లోకి హయ్యా కార్డ్ ఎంట్రీ సిస్టమ్ కోసం సైన్ అప్ చేసి ఉండాలని పేర్కొంది. షటిల్ విమానాలలో ప్రయాణీకులు 24 గంటల వ్యవధిలో ఖతార్ వెళ్లి రావచ్చని, వసతి పొందాల్సిన అవసరం లేదని విమానయాన సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!