జెబెల్ అలీ పోర్ట్ అగ్నిప్రమాదం: ఐదుగురి జైలు శిక్షను సమర్థించిన కోర్టు
- November 22, 2022
యూఏఈ: జెబెల్ అలీలోని ఓడరేవులో లంగరు వేసిన ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యానికి కెప్టెన్‌తో పాటు మరో నలుగురిని ఒక నెలపాటు జైలులో ఉంచుతూ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. అగ్నిప్రమాదంలో వివిధ పదార్థాలు, పోర్ట్ బెర్త్‌లోని కొంత భాగం పాడైపోయింది. అలాగే లోడింగ్, అన్లోడ్ మెషీన్లు కూడా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు 24 మిలియన్ దిర్హామ్‌ల నష్టం సంభవించింది. అయితే, న్యాయస్థానం నాలుగు షిప్పింగ్ కంపెనీలను కూడా దోషులుగా నిర్ధారించి ఒక్కొక్కరికి Dh100,000 చొప్పున జరిమానా విధించాలని తీర్పు చెప్పింది. అలాగే దీనికి సంబంధించిన సివిల్ కేసును సమర్థ కోర్టుకు రిఫర్ చేసింది.
2021 జూలైలో జెబెల్ అలీ ఓడరేవు డాక్‌లలో ఒకదానిలో లంగరు వేసిన ఓడలో మంటలు చెలరేగాయి. సివిల్ డిఫెన్స్ సిబ్బంది 40 నిమిషాల్లో వాటిని నియంత్రించారు. ఈ ప్రమాదంలో కొంతమంది ఆసియా నావికులకు స్వల్ప గాయాలయ్యాయి. 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 21 రోజుల పాటు ప్రమాదకర పదార్థాలను కలిగి ఉన్న కంటైనర్లను ఎండలో పెట్టడంతో పాటు, ఉపయోగించిన ప్యాకేజీల నాణ్యత లోపాలే ప్రమాదానికి కారణంగా ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







