ఆరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించిన నూర్ రియాద్ ఫెస్టివల్
- November 22, 2022
రియాద్: నవంబర్ 19తో ముగిసిన ‘నూర్ రియాద్ 2022’ ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో ఆరు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. 17 రోజులపాటు జరిగిన ఈ ఫెస్టివల్ "పల్స్ ఆఫ్ లైట్" పేరుతో నిర్వహించిన ఆర్ట్‌వర్క్ గిన్నిస్ రికార్డులలో ఎక్కింది. అధిక దూరం లైట్ లేజర్ డిస్ప్లే, అతిపెద్ద లైట్ లేజర్ డిస్ప్లే, అత్యధిక బిల్డింగ్ ఇంటర్ఫేస్, అతిపెద్ద డిస్ప్లే ఏర్పాటు, అత్యధిక సంఖ్యలో డ్రోన్ల వినియోగాం, అతిపెద్ద సృజనాత్మక కళా ప్రదర్శనలు గిన్నిస్ రికార్డులను నమోదు చేశాయి. నూర్ రియాద్ ఫెస్టివల్ లో సౌదీతోపాటు 30 దేశాల నుంచి 130 కిపైగా అంతర్జాతీయ కళాకారులు పాల్గొని 190 లైట్ ఆర్ట్ లను ప్రదర్శించారు. నవంబర్ 3న ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని 2.8 మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు సందర్శించారు. ఇది మలాజ్ పరిసరాల్లోని కింగ్ అబ్దుల్లా పార్క్, అల్సఫరత్ పరిసరాలు, దిరియా హిస్టారికల్ టౌన్, కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా సౌదీ రాజధాని అంతటా 40 ప్రదేశాలలో 500 విభిన్న ఈవెంట్లను ప్రదర్శించారు. ఇది లైట్ ఆర్ట్స్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ గా రికార్డు సాధించింది. ముగింపు వేడుకలకు సంస్కృతి మంత్రి, రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు, రియాద్ ఆర్ట్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







