చైతు ‘NC22’ ప్రీ లుక్ విడుదల
- November 22, 2022 
            హైదరాబాద్: నాగ చైతన్య NC22 ప్రీ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో NC22 పేరిట ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో ప్రియమణి తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తరుణంలో వారి పాత్రల తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి నింపుతున్నారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసిన మేకర్స్..మంగళవారం నాగ చైతన్య తాలూకా ప్రీ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది
‘అతని ఆవేశాన్ని ఏ శక్తీ అదుపు చేయదు’ అంటూ రిలీజ్ చేసిన #NC22 భీకరమైన ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పోలీస్ గెటప్ లో ఉన్న నాగచైతన్య ను కొందరు పోలీసులు గన్నులు గురి పెట్టి అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. చైతూ పేస్ ని రివీల్ చేయకుండా.. కేవలం అతని కళ్ళు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేసారు. ఇంటెన్స్ గా ఉన్న చైతు కళ్ళు చూస్తుంటే.. అతను ఆవేశంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ లో చైతన్య ఒక పోలీస్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు తెలుస్తుంది. అలానే ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు అరవింద్ స్వామి NC22 సినిమాలో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ధృవ’ మూవీ తర్వాత ‘రోజా’ హీరో తెలుగులో విలన్ గా నటించే సినిమా ఇదే అవుతుంది. ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో జీవా కూడా నాగచైతన్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







