భారత్-న్యూజిలాండ్: మూడో టీ20 డక్‌వర్త్ లూయిస్ నిబంధనతో టై..
- November 22, 2022
న్యూజిలాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్‌వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. అయితే, 9 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి టీమిండియా 75 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది.
వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. 9 ఓవర్లకు డక్‌వర్త్ లూయిస్ స్కోరు 75. అయితే, 9 ఓవర్లకు టీమిండియా సరిగ్గా 75 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ లో ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11, సూర్యకుమార్ యాదవ్ 13, శ్రేయాస్ అయ్యర్ 0, హార్దిక్ పాండ్యా 30, దీపక్ హూడా 9 పరుగులు చేశారు. దీంతో భారత్ 9 ఓవర్లకు 75/4 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ఆడం మిల్నీ, ఇష్ సోధీ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా వెల్లింగ్టన్ లో మొదటి టీ20 ఆడకుండా వర్షం అడ్డుతగిలింది. అలాగే, మొన్న మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. నేడు నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ లో మూడో టీ20 డ్రాగా ముగియడంతో భారత్ టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నెల 25 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!







