చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..

- November 24, 2022 , by Maagulf
చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..

చైనా: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 30,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 31,545 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లు 27,517 మంది వరకు ఉన్నారని అక్కడి వైద్య అధికారులు తెలిపారు.

ఒకవైపు చైనాలో అధికారులు కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ, కోవిడ్ భారీ స్థాయిలో ప్రబలుతోంది. లాక్ డౌన్, పర్యాటక ఆంక్షలు, మాస్ టెస్టింగ్ వంటివి చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. చైనా జనాభాతో పోలిస్తే కేసుల నమోదు తక్కువ శాతంలోనే ఉన్నప్పటికీ, అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా ఒకట్రెండు కేసులు నమోదైనా సరే ఆ ప్రాంతం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నారు. కోవిడ్ సోకిన పేషెంట్లను పూర్తి స్థాయిలో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. మరోవైపు కోవిడ్ కారణంగా చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో లాక్ డౌన్ విధిస్తుండటం వరుసగా ఇది మూడో ఏడాది. అనేక దేశాలు కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ, చైనా మాత్రం దీన్నుంచి బయటపడటం లేదు. చైనాలో ఒకరిద్దరికి కోవిడ్ సోకినా నగరం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నారు.

దీంతో ప్రజలకు తాగునీరు, ఔషధం, ఆహారం వంటివి కూడా అందడం లేదు. దీనిపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. అయితే, వీటిని ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడి ప్రజల ఉద్యమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com