సమంతకు మళ్లీ అనారోగ్యం.! నెట్టింట వైరల్ అవుతున్న ఇష్యూ.!
- November 24, 2022ఇటీవల ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చేరిన సమంత, ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. చికిత్స అనంతరం ఇంట్లోనే వుండి రెస్ట్ తీసుకుంటోంది సమంత.
మరికొద్ది రోజుల్లోనే తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వర్కవుట్లు కూడా స్టార్ట్ చేసింది సమంత.
ఇదిలా వుంటే, మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత అంటూ సోషల్ మీడియాలో ఓ గాలి వార్త సడెన్‌గా పుట్టుకొచ్చింది. ఇది గాలి వార్తే అంటూ సమంత మేనేజర్ ఖండించాడు. సమంత ఆరోగ్యంగానే వుంది. ఇంట్లోనే వుంది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తనకు ‘మయోసైటిస్’ అను వ్యాధి వుందని సమంత చెబితేనే తెలిసింది. వన్స్ ఈ విషయం బయటికొచ్చాకా ఇదే తరహా వ్యాధి.? వస్తే ఏమవుతుంది.? అంటూ ఆరాలు పట్టిన నెటిజన్లు.. ఇంకేముంది.. ఈ వ్యాధి వస్తే చచ్చిపోవడమే.. అంటే సమంత నయం కాని వ్యాధితో బాధపడుతోంది.. కెరీర్‌కి ఇకపై గుడ్ బై చెప్పేయాల్సిందే.. అన్నట్లుగా పుకార్లు పుట్టించేశారు.
నేనింకా చావలేదు. నేను బాగానే వున్నాను.. అంటూ సమంత స్వయంగా బయటికి వచ్చి చెబితే కానీ, ఆ పుకార్లకు చెక్ పడలేదు. ఇప్పుడు మళ్లీ ఇదిగో ఇలాంటి పుకార్లు..! ఏం చేస్తాం.! నెటిజన్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ