విదేశాల్లో 'సరైనోడు' కాసుల వర్షం
- April 24, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ రిలీజ్ రోజున భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. విమర్శకులకు ఈ సినిమా నచ్చనప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. వీకెండ్ లో ఎంత వసూలు చేస్తుందనే దానిపై కలెక్షన్లు ఆధారపడివుంటారని చెప్పారు. విదేశాల్లో 'సరైనోడు' కాసుల వర్షం కురిపిస్తున్నాడని చెప్పారు. ఉత్తర అమెరికాలో ఇప్పటికే కలెక్షన్లు 5 లక్షల డాలర్లు మించాయి.గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







