ప్రవాసీ భారతీయ దివస్-2023: కువైట్‌లో కర్టెన్ రైజర్ ఈవెంట్

- November 26, 2022 , by Maagulf
ప్రవాసీ భారతీయ దివస్-2023: కువైట్‌లో కర్టెన్ రైజర్ ఈవెంట్

కువైట్: ఇండియాలో 2023 జనవరి 8-10 తేదీల్లో "డయాస్పోరా: అమృత్ కాల్‌లో భారతదేశం పురోగతికి నమ్మకమైన భాగస్వాములు" అనే ఇతివృత్తంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD)-2023 కోసం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఎంబసీ ఛార్జ్ డి అఫైర్స్  స్మితా పాటిల్ మాట్లాడుతూ.. PBD-2023లో పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కువైట్‌లోని భారతీయ సమాజ సభ్యులను ఆహ్వానించారు. ఈవెంట్ సందర్భంగా.. పాల్గొనేవారికి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. PBD-2023 కోసం రిజిస్ట్రేషన్ ఫీజుపై 25% తగ్గింపును పొందడం ద్వారా గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ నవంబర్ 3 వరకు గడవు ఉంది. భారతీయ ప్రవాసుల సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ టూరిజం హోటల్ ధరలను తగ్గించింది. PBD-2023 నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జరగబోతోంది. ఇప్పటి వరకు పదహారు PBD సమావేశాలు నిర్వహించబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా 2021లో 16వ PBD వర్చువల్ గా  నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com