నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54..

- November 26, 2022 , by Maagulf
నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలో సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. రాకెట్ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 10.26 గంటల నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. పీఎస్ఎల్వీ సీ54 ద్వారా కక్ష్యలోకి ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) అనే ఉపగ్రహాన్ని పంపించనున్నారు. దీనితోపాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపనుంది.

భారత్‌‌కు చెందిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌–2, ఆనంద్, ఇండియా – భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ఈవోఎస్ సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 56వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్ 06 ఉపగ్రహం భూపరిశోధనలు, సముద్ర గర్భంలో అధ్యయనంకోసం ఉపయోగపడుతుంది. పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం సందర్భంగా ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాధ్, శాస్త్రవేత్తలు, భూటాన్ దేశ ప్రతినిధులు షార్ కి చేరుకున్నారు. షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆనవాయితీ ప్రకారం.. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారం షార్‌ సమీపంలో చెంగాళమ్మ ఆలయంతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలాఉంటే ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ఎనిమిది ఉపగ్రహాల్లో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువస్పేస్‌ రూపొందించిన థైబోల్ట్‌ 1, థైబోల్ట్‌ 2 ఉపగ్రహాలుకూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. దాదాపు 20 ఎంఎస్ఎంఈల సహాయంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించామని ధ్రువ స్పేస్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజయ్‌ నెక్కంటి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రేడియో ఆపరేటర్లకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com