ప్రవాసీ భారతీయ దివస్-2023: కువైట్‌లో కర్టెన్ రైజర్ ఈవెంట్
- November 26, 2022
కువైట్: ఇండియాలో 2023 జనవరి 8-10 తేదీల్లో "డయాస్పోరా: అమృత్ కాల్లో భారతదేశం పురోగతికి నమ్మకమైన భాగస్వాములు" అనే ఇతివృత్తంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD)-2023 కోసం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఎంబసీ ఛార్జ్ డి అఫైర్స్ స్మితా పాటిల్ మాట్లాడుతూ.. PBD-2023లో పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కువైట్‌లోని భారతీయ సమాజ సభ్యులను ఆహ్వానించారు. ఈవెంట్ సందర్భంగా.. పాల్గొనేవారికి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. PBD-2023 కోసం రిజిస్ట్రేషన్ ఫీజుపై 25% తగ్గింపును పొందడం ద్వారా గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ నవంబర్ 3 వరకు గడవు ఉంది. భారతీయ ప్రవాసుల సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ టూరిజం హోటల్ ధరలను తగ్గించింది. PBD-2023 నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జరగబోతోంది. ఇప్పటి వరకు పదహారు PBD సమావేశాలు నిర్వహించబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా 2021లో 16వ PBD వర్చువల్ గా నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









