యూరప్ వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 26, 2022
‘బాస్ పార్టీ’ అంటూ లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలాతో మెగాస్టార్ వేసిన ఈ స్పెషల్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించేశాయి.
చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమా నుంచి స్టెప్పులు కాపీ కొట్టేశారనీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లు కూడా కాపీ కొట్టేశాడంటూ ఈ పాటపై అనేక విమర్శలొచ్చాయ్ కానీ, సాంగ్ అయితే ఓ ఊపు ఊపేసింది.
ఇక, ఇప్పుడు మరో సాంగ్ షూటింగ్ కోసం ‘వాల్తేర్ వీరయ్య’ అండ్ టీమ్ యూరప్ బయల్దేబోతోందట. హీరోయిన్ శృతిహాసన్‌తో ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటూ వీలైతే మరికొన్ని పాటలు యూరప్ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందబోతన్న ‘వాల్తేర్ వీరయ్య’పై భారీగా అంచనాలున్నాయ్.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









