కువైట్ లో 11 మంది ఆసియన్ క్రాస్ డ్రస్సర్స్ అరెస్ట్
- November 27, 2022కువైట్: కువైట్‌లో సాల్మియాలోని మసాజ్ పార్లర్లో పనిచేస్తున్న పదకొండు మంది ఆసియా మేల్ క్రాస్ డ్రెస్సర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశంలోకి ఎంట్రీ వీసాలు పొందిన కొంతమంది క్రాస్ డ్రెస్సర్లు, వారిని తీసుకువచ్చిన కంపెనీల గురించి తమకు ఒక ఆసియా దేశం నుండి సమాచారం అందిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అందిన సమాచారంపై దర్యాప్తు ప్రారంభించి, వారిని రిక్రూట్ చేసిన కంపెనీలను తనిఖీ చేసి వారిలో కొందరిని అరెస్టు చేశామని, జాబితాలోని మరికొందరని త్వరలోనే గుర్తిస్తామన్నారు. ఇటీవలి కాలంలో మసాజ్ పార్లర్లలో ది క్రాస్ డ్రస్సర్లతో సహా పదుల సంఖ్యలో లేబర్ నిబంధనలను ఉల్లంఘించిన కార్మికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరికి అవసరమైన ఆరోగ్య లైసెన్స్‌లు లేవని, మరికొందరు కంపెనీ స్పాన్సర్‌షిప్‌లో లేరని గుర్తించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..