కారు కొనుగోలుదారులకు ఎస్‌బీఐ శుభవార్త!
- November 27, 2022
భారత్ లో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు కొనుగోలుదారులకు తీపికబురు అంచింది.అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో లోన్ తీసుకొని కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది. కారు కొనేందుకు ఎస్‌బీఐ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన లోన్ వడ్డీ రేటు మారొచ్చు. అంతేకాకుండా ఈ లోన్ పొదడం వల్ల ఏడు ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీని వల్ల నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగే కారు ధరలో 90 శాతం మొత్తాన్ని ఫైనాన్స్ రూపంలో పొందొచ్చు.
అంతేకాకుండా ఎస్‌బీఐ కారు లోన్‌పై జీరో ప్రిపేమెంట్ పెనాల్టీ బెనిఫిట్ ఉంది. ఇంకా ఫోర్ క్లోజర్ చార్జిలు కూడా ఉండవు. ఏడాది తర్వాతనే ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం లభిస్తోంది. అంటే మూడు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ కోసం అప్లై చేసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
అంతేకాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి నవంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏకంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారు, మోడల్, డీలర్ షిప్ ప్రాతిపదికన కారు ఆఫర్‌లో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కారు కొనే వారు ఈ ప్రయోజనం కూడా సొంతం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్‌లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!