ఈనాడు-ఈటీవీ సంయుక్తంగా ఇంకుడు గుంతల తవ్వకo..
- April 24, 2016
జల సంరక్షణ కోసం ఈనాడు-ఈటీవీ సంయుక్తంగా ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టడం ఎంతో అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలో ఈనాడు-ఈటీవీ చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రతి నీటిబొట్టును నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని కోరారు. ఈనాడు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, సుజలాం-సుఫలాం లాంటి సామాజిక కార్యక్రమాలు రామోజీరావు చేపట్టడం ఎంతో హర్షనీయమని కొనియాడారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







