'బాబా’ రీ రిలీజ్.! సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో కొత్త హంగామా.!
- November 28, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్, మనీషా కోయిరాల జంటగా నటించిన ‘బాబా’ సినిమా గుర్తుందా.? సూపర్ స్టార్ రేంజ్‌కి ఆశించిన స్థాయి విజయం అందుకోలేదా సినిమా.
అయితే, ఇప్పుడెందుకు ఆ సినిమా ముచ్చట.. అంటారా.? ఆ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అవునండీ. ఈ మధ్య రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య.. ఇలా స్టార్ హీరోల సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేస్తూ మళ్లీ సూపర్ రేంజ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. అయితే, అకేషనల్‌గా ఆయా సినిమాల హీరోల సినిమాలు రీరిలీజ్ చేశారు.
కానీ, ఇప్పుడు సూపర్ స్టార్ నటించిన.. అదీ ఓ ఫ్లాప్ మూవీని రీ రిలీజ్ చేస్తుండడం ఒకింత ఆశ్చర్యకరంగా వుందనే చెప్పొచ్చు. అయితే, ఈ సినిమాలో కొన్ని స్పెషల్ సీన్లు యాడ్ చేసి మరీ రీ రిలీజ్ చేస్తున్నారట. ఆ సన్నివేశాలకు సంబంధించిన డబ్బింగ్ తాజాగా రజనీకాంత్ పూర్తి చేశారట. త్వరలోనే ‘బాబా’ ధియేటర్లలో సరికొత్తగా ప్రదర్శించబడనుందన్న మాట.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!