క్రీడారంగానికి చెందినవారే క్రీడా రాయబారిగా నియమించాలని ...
- April 24, 2016
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తాజాగా భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్ తప్పబట్టారు. ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్య ఆయనను తొలగించాలని అన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లే భారత్‌కు నిజమైన రాయబారులని, క్రీడా రాయబారిగా ఎవరినైనా నియమించాలని భావిస్తే.. వారు తప్పకుండా క్రీడారంగానికి చెందినవారై ఉండాలని ఆయన అన్నారు. ప్రముఖ రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న అర్హత ఏమిటని, ఆయనను రియో ఒలింపిక్స్ గుడ్ విల్ రాయబారిగా నియమించారని యోగేశ్వర్ దత్ ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







