నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు ప్రారంభించిన APSRTC
- November 29, 2022
అమరావతి: ప్రయాణికుల కోసం APSRTC నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ జిల్లాల నుంచి ఈ సర్వీసులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులైన స్టార్ లైనర్స్ విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలయ్యాయి. విజయవాడలో తొలి సర్వీసు 9330 నెంబరుతో ప్రారంభమైంది. విజయవాడ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.
విజయవాడ-విశాఖపట్నం ఎగువ బెర్త్ పెద్దలకు రూ.860, పిల్లలకు రూ.660, దిగువ బెర్త్ రూ.930-రూ.720గా నిర్ణయించారు. విజయవాడ – అన్నవరం ఎగువ బెర్త్ పెద్దలకు రూ. 580, పిల్లలకు రూ.490; దిగవ బెర్త్ రూ.630-రూ.450 ను ఛార్జీలుగా ఫిక్స్ చేశారు. ఇందులో బస్సు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌లు ఉండనున్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్ సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. APSRTC తీసుకువచ్చిన ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దూర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..