ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ చమురు అన్వేషణపై దృష్టి..

- April 24, 2016 , by Maagulf
ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ చమురు అన్వేషణపై దృష్టి..

ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ చమురు అన్వేషణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో 17 షెల్‌గ్యాస్‌, ఆయిల్‌ బావులను తవ్వాలని నిశ్చయించుకుంది. దీనికోసం దాదాపు రూ.7,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇటీవల జరిగిన అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌పర్ట్స్‌ అప్రైజల్‌ కమిటీ సమావేశ అజెండాలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఓఎన్‌జీసీ తొలిసారిగా భారీఎత్తున షెల్‌గ్యాస్‌ అన్వేషణ చేపట్టిందని పీఎస్‌యూ వర్గాలకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. మెహసానాలో కాంబే బేసిన్‌లో 11 ప్రాంతాల్లో.. తమిళనాడులోని నాగపట్నంలో ఒక చోట, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కేజీ బేసిన్‌లో ఐదుచోట్లషెల్‌గ్యాస్‌ అన్వేషణ జరిపేందుకు ఓఎన్‌జీసీ ఇప్పటికే అనుమతులు కోరింది. ఒక్క మెహసాన బేసిన్‌లో అన్వేషణపైనే దాదాపు రూ.366 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. ఇక కేజీ బేసిన్‌లో 217 కోట్లు, తమిళనాడులో రూ.45కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com