హిట్ 2: ఆ సీక్రెట్ చెప్పొద్దంటోన్న అడవి శేష్.!
- November 29, 2022
మాస్ కా దాస్ హీరోగా రూపొందిన ‘హిట్ - ది ఫస్ట్ కేస్’ సక్సెస్ అవ్వడంతో, దానికి కొనసాగింపుగా ‘హిట్ - ది సెకండ్ కేస్’ తెరకెక్కించారు. అడవి శేష్ ‘సెకండ్ కేస్’లో హీరోగా నటిస్తున్నాడు.
డిశంబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రమోషన్ చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయ్.
దాంతో సినిమాపై అంచనాలు బాగా వున్నాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో చాలానే సినిమాలొచ్చినా వాటిన్నింట్లోకీ ‘హిట్ 2’ విభిన్నంగా వుండబోతోందనీ అంటున్నారు.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా, ముందుగానే సినిమా చూసేసిన వాళ్లు దయచేసి సినిమాలోని సస్సెన్స్ రివీల్ చేయద్దనీ, బిగ్ స్ర్కీన్‌పై ఆ థ్రిల్ ప్రతీ ప్రేక్షకుడూ ఫీలవ్వాలని హీరో అడవి శేష్ అంటున్నాడు.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇంతకీ ఆ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఏంటబ్బా.! అది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!