వారం రోజుల్లో 11,688 అతివేగ ఉల్లంఘనలు

- December 06, 2022 , by Maagulf
వారం రోజుల్లో 11,688 అతివేగ ఉల్లంఘనలు

కువైట్: నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు అల్-వఫ్రా రోడ్ (306)లో కొత్తగా ఏర్పాటు చేసిన P2P కెమెరా సిస్టమ్ ద్వారా 11,688 వేగ ఉల్లంఘనలు నమోదయ్యాయని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వాహనదారులు, రహదారి వినియోగదారులు తమ భద్రత, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడానికి వేగ పరిమితులను పాటించాలని జనరల్ ట్రాఫిక్ విభాగం హెచ్చరించింది. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, లేదంటే భారీ జరిమానాలతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com