‘ఆసియా కప్‌ 2027’కు సౌదీ అరేబియా ఆతిథ్యం

- December 06, 2022 , by Maagulf
‘ఆసియా కప్‌ 2027’కు సౌదీ అరేబియా ఆతిథ్యం

సౌదీ: ఆసియా కప్‌ 2027 నిర్వాహణకు భారతదేశం(ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)) తన బిడ్‌ను ఉపసంహరించుకోవడంతో టోర్నమెంట్‌కు ఏకైక బిడ్డర్‌గా నిలిచిన సౌదీ అరేబియాకు నిర్వాహణ హక్కులు లభించాయి. దీంతో 2027 ఆసియా కప్‌ కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) వెల్లడించింది. అక్టోబర్‌లో భారతదేశం, సౌదీ అరేబియాలను AFC ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసింది.
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సౌదీ అరేబియా ఇప్పుడు తమ తొలి AFC ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. AFC కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బహ్రెయిన్ రాజధాని మనామాలో హోస్ట్‌ దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో సౌదీ అరేబియా తమ ప్రారంభ మ్యాచ్‌లో 2-1తో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
2023 ఆసియా కప్‌కు కూడా ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని గతంలో చైనాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దాని కోవిడ్-19 మార్గదర్శకాల కారణంగా దేశం ఉపసంహరించుకుంది. ఆసియా కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2019లో యూఏఈ ఆతిథ్యమిచ్చిన టోర్నమెంట్ చివరి ఎడిషన్‌ను ఖతార్ గెలుచుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com