డిసెంబర్ 7న కువైట్ ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’

- December 06, 2022 , by Maagulf
డిసెంబర్ 7న కువైట్ ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’

కువైట్: డిసెంబర్ 7న కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ‘ఓపెన్ హౌస్’ నిర్వహించనున్నది. బుధవారం ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి అర్హులు. నిర్దిష్ట ప్రశ్నల గురించి విచారించాలనుకునే వారు వారి పూర్తి పేరు (పాస్‌పోర్ట్‌లో పేర్కొన్నట్లు), పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, చిరునామాతో సంప్రదింపు నంబర్‌ను పంపవలసిందిగా ఎంబసీ సూచించింది. పూర్తి వివరాలను [email protected] కు ఇమెయిల్ పంపాలని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com