కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి: ప్రధాని మోడీ

- December 07, 2022 , by Maagulf
కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి: ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ: మూడు వారాల పాటు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నారు. జీ-20 సదస్సును భారత్‌ నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సమావేశాలు భారత్‌కు చాలా కీలకమన్నారు. కొత్త ఎంపీలకు , యువ ఎంపీలకు ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు సభలో అవకాశం లభించాలన్నారు ప్రధాని మోడీ. మొదటి వారం వేడిగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సభలో ప్రధాని ప్రసంగిస్తున్నారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్ర‌ధాన మంత్రి, చైర్మ‌న్‌కి సభతో పాటు దేశం తరపున కూడా అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com