డిసెంబర్ 11న ఎమిరేట్స్ లూనార్ మిషన్ ప్రయోగం
- December 08, 2022
దుబాయ్: ఎమిరేట్స్ లూనార్ మిషన్ కొత్త ప్రయోగ కొత్త తేదీని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) వెల్లడించింది. రషీద్ రోవర్ ని స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా డిసెంబర్ 11న 11:38 గల్ఫ్ స్టాండర్డ్ టైమ్ (GST) లేదా 02:38 తూర్పు యూఎస్ సమయానికి ప్రయోగించనున్నారు. గతంలో ప్రయోగాన్ని వివిధ కారణాలతో నాలుగు సార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రయోగించిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుని కక్ష్యను చేరేందుకు తక్కువ-శక్తి వినియోగ మార్గం ద్వారా 5 నెలలపాటు ప్రయాణించనున్నది. ఏప్రిల్ 2023లో ఇది చంద్రుని కక్ష్యను చేరే అవకాశం ఉన్నదని స్పేస్ సెంటర్ వెల్లడించింది. ప్రయోగాన్ని MBRSC లైవ్ స్ట్రీమ్‌లో www.mbrsc.ae/lunarలో చూడవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







