ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనల ఖర్చుల వివరాలు
- December 09, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో అనేకసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఈ పర్యటనల్లో భాగంగా ఇతర దేశాలతో పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు గడిచిన ఐదేళ్లలో 36సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది.
ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ. 239 కోట్లుకుపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్లారు. ఈ పర్యటనకోసం ప్రభుత్వం రూ. 32,09,760 ఖర్చు చేసిందని తెలిపారు.
సెప్టెంబరు 26-28 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు రూ. 23,86,536 ఖర్చు చేసినట్లు మంత్రి రాజ్యసభలో తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని యూరప్ పర్యటన వివరాలను తెలియజేస్తూ, మొత్తం ఖర్చు రూ. 2,15,61,304 కాగా, సెప్టెంబర్ 21-28, 2019 మధ్య కాలంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రూ. 23,27,09,000 ఖర్చయిందని మురళీధరన్ రాజ్య సభలో తెలియజేశారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







