బిగ్‌బాస్.! కప్పు కోసం బరిలో నిలిచేది వారిద్దరేనా.?

- December 10, 2022 , by Maagulf
బిగ్‌బాస్.! కప్పు కోసం బరిలో నిలిచేది వారిద్దరేనా.?

బిగ్‌బాస్ ఆరో సీజన్‌కి సంబంధించి మొదట్నుంచీ సింగర్ రేవంత్ టాప్‌లో వుంటూ వస్తున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ ఈ సీజన్‌లో రేవంతే దక్కించుకుంటున్నాడని టాక్ కూడా వుంది.
ఇక, ఈ సీజన్ విన్నర్ కూడా రేవంత్ అనే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, షోలో రేవంత్ పట్ల నెగిటివిటీ ఏర్పడుతూ వచ్చింది. దాంతో, ప్రేక్షకుల అభిప్రాయాలు మధ్యలో మారుతూ వచ్చినప్పటికీ క్లైమాక్స్‌కి చేరే సరికి మళ్లీ రేవంత్ పేరే వినిపిస్తోంది.
బిగ్‌బాస్ మరో రెండు వారాలు మాత్రమే మిగిలి వుంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో వున్నారు. అందులో ముగ్గురు లేడీస్, నలుగురు జెంట్స్. ఈ ఏడుగురిలో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరిని బయటికి పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ శ్రీహాన్ ఫైనలిస్ట్ లిస్టులో చేరిపోయాడు. అన్ అఫీషియల్ ఓటింగ్ లిస్టులో రేవంత్ ఎప్పటిలాగే టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక మిగిలిన వారిలో ఇనయ, ఆది రెడ్డి న్యూట్రల్‌గా వుండగా, కీర్తి, రోహిత్, శ్రీసత్యలు డేంజర్ జోన్‌లో వున్నట్లు తెలుస్తోంది. 
సో ఈ ముగ్గురిలో ఇద్దరు బయటికి వెళతారా.? లేదా.? ఒక్కరే వెళతారా.? అనేది తెలియాల్సి వుంది. ఇక కప్పు కోసం ఫైనల్‌గా పోరాడేది శ్రీ హాన్, రేవంత్ అని ప్రేక్షకులు ఓ ఐడియాకి వచ్చేశారు. చూడాలి మరి, ఈ ఇద్దరు స్నేహితుల్లో కప్పు గెలిచేది ఎవరో.! 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com