బుట్టబొమ్మ ఫర్ఫెక్ట్లీ ఆల్రైట్.! త్వరలోనే సెట్లోకి అడుగులు.!
- December 10, 2022
పూజా హెగ్దేకి ఈ ఏడాది అస్సలు టైమ్ కలిసి రాలేదు. వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ, మూడూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లిస్టులో చేరిపోవడంతో, పూజా హెగ్దే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందిన సంగతి తెలిసిందే.
కానీ, అలాంటిదేం జరగలేదు. పూజా హెగ్దే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కోసం రాసి పెట్టిన ప్రాజెక్టులు ఆమె చేతిలోనే వచ్చి పడ్డాయ్. పవన్‌తో ఓ సినిమా, మహేష్‌తో ఓ సినిమా పూజా హెగ్దే చేతిలో వున్నాయ్. పవన్ సినిమా సంగతి అటుంచితే, మహేష్ - త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ లోపు పూజా హెగ్దే షూటింగ్లో గాయపడిన కారణంగా కాలికి గాయంతో రెస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఈ మధ్యనే గాయం నుంచి కోలుకున్న పూజా హెగ్దే సోషల్ మీడియాలో సందడి చేసింది.
ఇక, త్వరలోనే షూటింగ్‌కి కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి పూజా హెగ్దే సెట్స్‌లో సందడి చేయనున్నట్లు ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అదే రోజు లేదంటే, ఆ తర్వాతి రోజు నుంచి మహేష్ కూడా సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నాడట.
తాజా వార్తలు
- కువైట్‌లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









