హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ
- December 10, 2022
సిమ్లా: హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో 35 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవికి కోసం ప్రయత్నాలు చేశారు.
మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి, పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం పదవి కోసం గట్టిగా ట్రై చేసారు. ఆమెనే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఖరారు చేసారు. రేపే (ఆదివారం) సీఎంగా సుఖ్విందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన రాష్ట్రంలోని నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక డిప్యూటీ సీఎం పదవికి ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. ఈయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. ముకేశ్ అగ్నిహోత్రి హరోలీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







