క్షీణించిన షర్మిల ఆరోగ్యం.. అపోలో ఆస్పత్రికి తరలింపు
- December 11, 2022
హైదరాబాద్: YSRTP అధినేత్రి వైస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను రెండో రోజు పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ చేసి ఆమె దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షర్మిలకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
హాస్పటల్ కు తరలించే ముందే దీక్ష స్థలి వద్ద ముగ్గురు వైద్యులు షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో వైద్యుల సూచన మేరకు షర్మిలను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెను దీక్షా శిబిరం నుండి ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ లో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తమ కూతురు షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి షర్మిల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్‌లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









