మనీలాండరింగ్ దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష, SR500,000 జరిమానా
- December 12, 2022
రియాద్: మనీలాండరింగ్‌లో నేరం రుజువైన తర్వాత సౌదీ కోర్టు ఒక సౌదీ, నలుగురు అరబ్ జాతీయులకు 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు SR 500,000 జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. సౌదీ పౌరుడు వాణిజ్య సంస్థల కోసం రిజిస్ట్రేషన్ తెరిచాడు. ఆపై సంస్థల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఈ సంస్థల పేరుతో లావాదేవీలు చేపట్టడానికి వీలుగా వాటిని ప్రవాసులకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు, వాణిజ్య సంస్థల ఖాతాలపై జరిపిన ఆర్థిక పరిశోధనలలో ప్రవాసుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖాతాలలో జమ చేసి, ఆపై వాటిని ఇతర దేశాలకు బదిలీ చేసినట్లు విచారణలో తేలడంతో నిందిదులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!