హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు
- December 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్ కు దిగుమతి చేసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సరఫరా చేస్తున్నారని తెలపారు.
విదేశాలకు చెందిన పలువురితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిది కిలోల ఎపిడ్రిన్ స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







